China: మీరు రోజూ వ్యాయామం చేస్తారా?.. అయితే, మీకో గుడ్‌న్యూస్!

Aerobic cures kidney problems

  • వారానికి 150 నిమిషాల ఏరోబిక్ ద్వారా కిడ్నీ సమస్యలు దూరం
  • సాధ్యం కాకుంటే రోజూ గంట వాకింగ్ ద్వారానూ ఫలితాలు
  • 2 లక్షల మందిపై జరిపిన అధ్యయనంలో వెల్లడి

రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో కిడ్నీ సమస్యల ముప్పు తక్కువని ఓ పరిశోధనలో తేలింది. వంశపారంపర్యంగా కిడ్నీ వ్యాధుల ముప్పు ఉన్నవారు వారానికి 150 నిమిషాలపాటు ఏరోబిక్ వ్యాయామాలు కానీ, లేదంటే 75 నిమిషాలపాటు ఇతర వర్కవుట్లు చేయడం ద్వారా కానీ కిడ్నీ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.

తైవాన్‌కు చెందిన 18 ఏళ్లలోపున్న 2 లక్షల మంది ఆరోగ్యంపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. వ్యాయామం చేయని వారితో పోలిస్తే చేసేవారిలో కిడ్నీ సమస్యల ముప్పు 9 శాతం తక్కువగా ఉన్నట్టు అధ్యయనకారులు గుర్తించారు. ఏరోబిక్, జిమ్ వర్కవుట్లు చేయడం సాధ్యం కాకపోతే రోజూ గంట వాకింగ్, లేదంటే రెండు గంటల రన్నింగ్ చేయడం ద్వారా కిడ్నీ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

  • Loading...

More Telugu News