Varla Ramaiah: బొత్స నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే: వర్ల రామయ్య

Varla Ramaiah slams Botsa

  • బీజేపీతో వైసీపీ పొత్తు అంటూ ప్రచారం
  • స్పందించిన వర్ల రామయ్య
  • విలువలు ఎలా మారతాయో బొత్సను చూస్తే అర్థమవుతుందని వ్యాఖ్యలు

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ధ్వజమెత్తారు. బొత్స నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. అవసరమొస్తే ఎవరి కాళ్లు, గడ్డమైనా పట్టుకుంటామని నిన్న బొత్స అనలేదా? అంటూ నిలదీశారు. ఎన్డీయేలో చేరితో ముస్లింలంతా ఛీకొడతారని, అందుకే వెనక్కి తగ్గారని విమర్శించారు.

రాజకీయాల్లో విలువలు ఏ విధంగా మారతాయో బొత్సను చూస్తే అర్థమవుతుందని అన్నారు. ఇప్పటికిప్పుడు బొత్స తన ఆస్తుల్ని ప్రకటించగలరా? అని వర్ల రామయ్య సవాల్ విసిరారు. ఈ సందర్భంగా వర్ల వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుపైనా విమర్శలు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న ఉమ్మారెడ్డి కోట్ల రూపాయలకు ఎలా పడగలెత్తారో చెప్పాలని నిలదీశారు.

Varla Ramaiah
Botsa Satyanarayana Satyanarayana
BJP
YSRCP
  • Loading...

More Telugu News