Avanthi Srinivas: దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు డబ్బు పంపారు: అవంతి

Avanthi alleges Chandrababu and lokesh

  • చంద్రబాబుపై అవంతి విమర్శలు
  • మనీ ల్యాండరింగ్ లో చంద్రబాబు దిట్ట అంటూ వ్యాఖ్యలు
  • అవినీతి కారణంగానే మోదీకి దూరమయ్యారని వెల్లడి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శనాస్త్రాలు సంధించారు. మనీ ల్యాండరింగ్ లో చంద్రబాబు దిట్ట అని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు డబ్బు పంపించారని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు, లోకేశ్ తమ అవినీతి కారణంగానే మోదీకి దూరమయ్యారని వివరించారు. చంద్రబాబు, లోకేశ్ సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయారని తెలిపారు. పవన్ కల్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు అక్రమాల్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో తమకేమీ శత్రుత్వం లేదని అవంతి స్పష్టం చేశారు.

Avanthi Srinivas
Chandrababu
BJP
Nara Lokesh
Narendra Modi
  • Loading...

More Telugu News