Shahid Afridi: ఈ క్రికెట్ దిగ్గజానికి ఐదోసారీ అమ్మాయే పుట్టింది!

Another girl child for Afridi

  • అఫ్రిదికి మరోసారి అమ్మాయి
  • ఇప్పటికే నలుగురు కుమార్తెలు 
  • ఐదో బిడ్డ జననాన్ని సంతోషంగా వెల్లడించిన అఫ్రిది

పాకిస్థాన్ క్రికెట్ కు విశేష రీతిలో సేవలు అందించిన దిగ్గజ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదికి ఇప్పటికే నలుగురు కుమార్తెలు ఉండగా, తాజాగా మరో అమ్మాయి పుట్టింది. అఫ్రిది భార్య నదియా పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అఫ్రిదినే వెల్లడించాడు. తనకు నలుగురు అద్భుతమైన కుమార్తెలు ఉన్నారని, అల్లా దయతో ఐదో బిడ్డ జన్మించిందని తెలిపాడు. దేవుని అపారమైన కరుణాకటాక్షాలు తనపై ఉన్నాయని ట్వీట్ చేశాడు. అంతేకాదు, నాలుగు ఐదయ్యింది అంటూ హ్యాష్ ట్యాగ్ ద్వారా పేర్కొన్నాడు. 45 ఏళ్ల అఫ్రిది కొంతకాలం కిందటే క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News