Pune Air port: విమానం టేకాఫ్ సమయంలో రన్ వే మీదకు జీప్.. తృటిలో తప్పిన ప్రమాదం

Jeep on Runway Early Take off plane

  • పైలట్ గమనించడంతో ముందుగానే టేకాఫ్
  • స్వల్పంగా దెబ్బతిన్న విమానం
  • ఢిల్లీలో సురక్షితంగా ల్యాండింగ్

మహారాష్ట్రలోని పూణే విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ఎ-321 విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీ వెళ్లడానికి ఈ విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో అనుకోకుండా రన్ వే పై జీపును, ఓ వ్యక్తిని గమనించిన విమానం పైలట్ ముందుగానే విమానాన్ని పైకి లేపారు. ఈ టేకాఫ్ బాగానే జరిగినప్పటికీ.. విమానం తోక భాగం భూమిని తాకడంతో బాడీ స్వల్పంగా దెబ్బతిందని సమాచారం.

అయితే సదరు విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అధికారులు స్పందిస్తూ.. దీనిపై ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతుందన్నారు. విమానంలో ఉండే కాక్ పిట్ రికార్డర్ ను స్వాధీనం చేసుకోవాలని ఎయిర్ ఇండియాకు తెలిపామని చెప్పారు. విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.

Pune Air port
Jeep on Runway
Early Take off
  • Loading...

More Telugu News