Vijay Devarakonda: విజయ్ దేవరకొండ అందించిన సాయంతో ఢిల్లీ వెళ్లి గోల్డ్ మెడల్ గెలిచిన యువ ఫైటర్

Vijay Devarakonda helps budding kick boxer to win gold medal

  • ఢిల్లీలో అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలు
  • ఎంట్రీ ఫీజు చెల్లించే డబ్బులేక ఇబ్బందిపడిన గణేశ్ అనే కిక్ బాక్సర్
  • అభిమానుల ద్వారా విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ
  • దేవరకొండ ఫౌండేషన్ ద్వారా రూ.24 వేల ఆర్థికసాయం

టాలీవుడ్ లో ఇప్పుడు మాంచి డిమాండ్ ఉన్న హీరో ఎవరంటే విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. అటు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సామాజిక సేవలతోనూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు. ఇతరులకు సాయం అందించడం కోసమే ప్రత్యేకంగా దేవరకొండ ఫౌండేషన్ ను స్థాపించాడు. తాజాగా, ఈ ఫౌండేషన్ ద్వారా ఆర్థికసాయం పొందిన ఓ యువ కిక్ బాక్సర్ దేశరాజధానిలో సత్తా చాటడమే కాదు, పసిడి పతకం కూడా కొల్లగొట్టాడు.

మెదక్ జిల్లాకు చెందిన గణేశ్ అనే యువకుడు ఓ కిక్ బాక్సింగ్ క్రీడాకారుడు. అయితే ఢిల్లీలో ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు పేదరికం అడ్డొచ్చింది. కనీసం ఎంట్రీ ఫీజు కూడా చెల్లించలేని గణేశ్ పరిస్థితిని ఫ్యాన్స్ ద్వారా తెలుసుకున్న విజయ్ దేవరకొండ చలించిపోయాడు. వెంటనే తన దేవరకొండ ఫౌండేషన్ ద్వారా గణేశ్ కు రూ.24 వేలు ఆర్థికసాయంగా అందించాడు.

తనకున్న ప్రధాన అడ్డంకి తొలగిపోవడంతో గణేశ్ ఢిల్లీలో జరిగిన కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ లో మెరుగైన ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించాడు. దీనిపై గణేశ్ స్పందిస్తూ, తన ఘనవిజయానికి కారణం విజయ్ దేవరకొండ అందించిన సాయమేనని, విజయ్ దేవరకొండ ప్రోత్సహించి, నగదు అందించకపోతే తాను ఈ స్థాయిలో నిలిచేవాడ్ని కాదని తెలిపాడు.

Vijay Devarakonda
Devarakonda Foundation
Ganesh
Kick Boxer
New Delhi
Gold Medal
  • Loading...

More Telugu News