Love Stroy: ట్రెండింగ్ గా మారిన ‘లవ్ స్టోరీ’ సినిమాలోని ‘ఏయ్ పిల్లా’ సాంగ్

Love Story song Yey pilla song Trending in Youtube

  • విడుదలైన కొద్దిసేపటికే.. 20 లక్షల వ్యూస్
  • శేఖర్ కమ్ములకు కళ్లద్దాలను బహుమతిగా ఇచ్చిన నాగ చైతన్య
  • ఇంకో టీజర్ కు మరో గిఫ్ట్ రెడీ చేసుకో అన్న శేఖర్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ సినిమాలోని ‘ఏయ్ పిల్లా’ అంటూ సాగే పాట ప్రివ్యూకు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. యూ ట్యూబ్ లో ఈ ప్రివ్యూ ట్రెండింగ్ గా మారింది. విడుదలయిన కాసేపటికే 20 లక్షల వ్యూస్ వచ్చాయి. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవిలపై చిత్రీకరించిన ఈ పాటను నాగార్జున, సమంతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.ప్రేమికుల రోజు సందర్భంగా నిన్న ఈ వీడియోను విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి వస్తోన్న ఈ స్పందనకు అటు దర్శకుడు, ఇటు హీరో నాగ చైతన్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ కమ్ములకు నాగ చైతన్య మంచి కళ్లద్దాలను బహుమతిగా అందించి తన సంతోషాన్ని పంచుకున్నారు.

కాగా, నాగ చైతన్య నుంచి బహుమతి  స్వీకరిస్తున్న సమయంలో తీసిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా శేఖర్ కమ్ముల పోస్ట్ చేస్తూ.. ప్రత్యేక బహుమతి  అందించినందుకు ధన్యవాదాలు చై. బహుమతితో నన్ను టచ్ చేశావు. తర్వాతి టీజర్ కి ఇంకో బహుమతి సిద్ధం చేసుకో’ అని ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.

Love Stroy
Movie
Song
Teaser
Video
Tollywood
Sheker Kammula Gift
Naga chaitanya
  • Error fetching data: Network response was not ok

More Telugu News