Vijay Devarakonda: నైజామ్ లో 'వరల్డ్ ఫేమస్ లవర్' తొలిరోజు వసూళ్లు

World Famous Lover Movie

  • నిన్ననే విడుదలైన 'వరల్డ్ ఫేమస్ లవర్'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ 
  • అమెరికాలో కనిపించని జోరు

విజయ్ దేవరకొండ - క్రాంతిమాధవ్ కాంబినేషన్లో రూపొందిన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వల్లభ నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నాయికలుగా రాశి ఖన్నా, కేథరిన్, ఐశ్వర్య రాజేశ్, ఇజబెల్లే అలరించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ ను సాధించింది.

తొలి రోజున నైజామ్ లో 2.02కోట్లను వసూలు చేసింది. విజయ్ దేవరకొండకి మొదటి నుంచి నైజామ్ లో ఫాలోయింగ్ ఎక్కువ. అందువల్లనే ఈ సినిమా ఇక్కడ తొలిరోజు భారీ వసూళ్లను రాబట్టింది. ఇక అమెరికాలో మాత్రం ఈ సినిమా వసూళ్లు అంత ఆశాజనకంగా లేవట. పబ్లిసిటీ పెద్దగా లేకపోవడం, సినిమా టీజర్ .. ట్రైలర్ లలో 'అర్జున్ రెడ్డి' ఛాయలు కనిపించడం వల్లనే అక్కడి ప్రేక్షకులు అంతగా ఆసక్తిని చూపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Vijay Devarakonda
Rasi Khanna
Catherine
World Famous Lover Movie
  • Loading...

More Telugu News