Hero Nithin: మా ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి: నితిన్

Hero Nithin says wedding works in his home started

  • త్వరలోనే హీరో నితిన్ పెళ్లి
  • శాలినితో జీవితం పంచుకోనున్న యువ హీరో
  • పసుపు దంచుతున్న ఫొటో ట్వీట్

టాలీవుడ్ యువ హీరో నితిన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఫారెన్ లో ఎంబీఏ చదువుతున్న శాలిని అనే అమ్మాయితో నితిన్ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడని, వీరి ప్రేమకు పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇప్పటికే మీడియాలో కథనాలు వచ్చాయి. మరికొన్నిరోజుల్లో వీరి పెళ్లి జరగనున్న నేపథ్యంలో, హీరో నితిన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తన ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయని వెల్లడించారు. 'మ్యూజిక్ స్టార్ట్స్... మీ ఆశీస్సులు కావాలి' అంటూ ట్విట్టర్ లో స్పందించారు. అంతేకాదు, తాను పెళ్లిచేసుకోబోయే అమ్మాయితో కలిసున్న ఫొటో, తమ పెళ్లిపనులకు నాందిగా పసుపు దంచుతున్న ఫొటోను కూడా పోస్టు చేశారు.

Hero Nithin
Shalini
Marriage
Tollywood
  • Loading...

More Telugu News