Kanakamedala Ravindra Kumar: బొత్స ప్రకటనపై జగన్ సమాధానం చెప్పాలి: కనకమేడల 

Jagan should answer on the statement of Botsa demands Kanakamedala

  • ఢిల్లీలో జగన్ ఏం బేరసారాలు ఆడుతున్నారు?
  • కేసుల్లో తనకు సహకరించాలని కేంద్రాన్ని కోరుతున్నారు
  • హోదాపై కేంద్రంతో ప్రకటన చేయించిన తర్వాతే ఎన్డీయేలో చేరాలి

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో జగన్ ఏం బేరసారాలు ఆడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే లేదని ఒకప్పుడు జగన్ చెప్పారని... ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. అక్రమాస్తుల కేసుల్లో తనకు సహకరించాలని కేంద్రాన్ని జగన్ కోరుతున్నారని ఆరోపించారు.

ఎన్డీయేలో వైసీపీ చేరుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారని... ఈ విషయమై ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రంతో ప్రకటన చేయించిన తర్వాతే ఎన్డీయేలో చేరాలని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను, ప్రాజెక్టులను సాధించిన తర్వాత ఎన్డీయేలో చేరితే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదని అన్నారు.

Kanakamedala Ravindra Kumar
Telugudesam
Jagan
Botsa Satyanarayana Satyanarayana
YSRCP
Special Category Status
NDA
  • Loading...

More Telugu News