Jagan: కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో సీఎం జగన్‌ భేటీ

AP CM jagan meets central minister ravisankar prasad

  • పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం
  • ఆయన వెంట పలువురు ఎంపీలు
  • రెండు రోజులుగా ఢిల్లీలోనే జగన్‌

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నుంచి అందిన పిలుపు మేరకు నిన్న దేశ రాజధాని  ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. నిన్నసాయంత్రం ఢిల్లీ చేరుకున్న జగన్‌ రాత్రి 9.45 గంటల సమయంలో అమిత్‌షాతో భేటీ అయి పలు అంశాపై చర్చించారు. ఈ రోజు రవిశంకర్‌తో సమావేశమై హైకోర్టు తరలింపు, శాసన మండలి రద్దు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, బాలశౌరి, నందిగం సురేష్‌లు ఉన్నారు.

Jagan
Ravi Shankar Prasad
Central Minister
New Delhi
Tour
  • Loading...

More Telugu News