Uddhav Thackeray: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో ప్రారంభమైన లుకలుకలు.. థాకరే తీరుపై శరద్ పవార్ అసంతృప్తి
- ఎల్గార్ పరిషత్ కేసును ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి థాకరే ఆమోదముద్ర
- రాష్ట్ర పరిధిలోకి కేంద్రం చొచ్చుకురావడం దారుణమన్న శరద్ పవార్
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన రోజుల వ్యవధిలోనే పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నాయి. ఎల్గార్ పరిషత్ కేసును ఎన్ఐఏకు అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఆమోదముద్ర వేయడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని... ఆ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం చొచ్చుకురావడం దారుణమని ఆయన అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శరద్ పవార్ తన అసంతృప్తిని వ్యక్తం చేయడం ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.