Dharmadhikari: మరో చోటుకి వెళ్లలేనంటూ.. బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి రాజీనామా!

Justis Dharmadhikari Resigns

  • 2003లో బొంబాయి హైకోర్టులో నియామకం
  • సీజేగా ప్రమోషన్ ఇస్తే వద్దన్న ధర్మాధికారి
  • వ్యక్తిగత కారణాలేనంటూ రాజీనామా లేఖలో వెల్లడి

బొంబాయి హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సత్యరంజన్‌ ధర్మాధికారి, తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఆయనకు పదోన్నతిపై వేరే రాష్ట్ర హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా వెళ్లే అవకాశం లభించినా, కుటుంబ పరమైన కారణాల వల్ల ముంబైకి వెలుపల తాను విధులు నిర్వర్తించలేనని ఆయన స్పష్టం చేశారు. ముంబై నగరాన్ని వీడేందుకు తాను సిద్ధంగా లేనని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కు పంపించానని, తన రాజీనామా వెనుక పూర్తిగా వ్యక్తిగత కారణాలు మాత్రమే ఉన్నాయని ఆయన మీడియాకు తెలిపారు. బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తనను నియమించేందుకు వారు సిద్ధంగా లేరని కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయని తెలిపారు. కాగా, 2003లో జస్టిస్‌ ధర్మాధికారి బొంబాయి హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు.

  • Loading...

More Telugu News