APSRTC: కేసీఆర్ చెప్పినా జగన్ వినలేదు: పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు

Perni Nani Comments on APSRTC

  • ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వద్దన్నారు
  • గుదిబండ పడుతుందని హెచ్చరించారు
  • అయినా జగన్ ముందడుగు వేశారన్న పేర్ని

ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయవద్దని కేసీఆర్ స్వయంగా చెప్పినా, జగన్ వినలేదని మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్మికులకు అవార్డులను అందించిన సందర్భంగా మాట్లాడిన ఆయన, ఈ విలీనం చాలా పెద్ద పొరపాటని కేసీఆర్ అన్నారని, కార్మికుల వేతనాలను ప్రభుత్వం భరించాలంటే, అదో పెద్ద గుదిబండేనని హెచ్చరించినా, తానిచ్చిన మాటను నిలబెట్టుకునేందుకే జగన్ ముందడుగు వేశారని అన్నారు.

 ప్రభుత్వంపై కార్మికులు నమ్మకాన్ని ఉంచాలని అన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం తప్పని భావిస్తే, తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ డిమాండ్ ను సైతం సీఎం పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు.

APSRTC
KCR
Jagan
Perni Nani
  • Loading...

More Telugu News