Supreme Court: మరణశిక్ష అప్పీళ్లకు సరికొత్త మార్గదర్శకాలు రూపొందించిన సుప్రీంకోర్టు

New directions by SC to clear petitions filed in severe cases

  • నిర్భయ దోషులకు ఇప్పటికీ అమలు కాని ఉరి
  • పిటిషన్లతో ఆలస్యం చేస్తున్న దోషులు
  • పిటిషన్ల విచారణ ఆర్నెల్లకు మించకూడదంటూ నూతన విధానం

నిర్భయ దోషులకు కోర్టు మరణశిక్ష విధించినా ఇప్పటికీ శిక్ష అమలు కాకపోవడం, పిటిషన్ల పేరిట విచారణ ఇంకా కొనసాగుతూనే ఉండడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. నిర్భయ దోషులందరికి ఒకేసారి ఉరి అమలు చేయాలన్న నిబంధన ఉండడంతో, ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు దాఖలు చేస్తూ ఉరి అమలును ఆలస్యం చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర నేరాల్లో కేసుల విచారణ 6 నెలల వ్యవధిలో పూర్తిచేయాలంటూ కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. హైకోర్టులు విధించే మరణశిక్షలపై దాఖలయ్యే పిటిషన్లపై విచారణ ఆర్నెల్లకు మించరాదని స్పష్టం చేసింది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసులను విచారిస్తుందంటూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Supreme Court
Nirbhaya
Petition
High Court
  • Loading...

More Telugu News