Facebook: ఫేస్ బుక్ నుంచి కొత్త యాప్.. ‘HOBBI’

Facebook released new app HOBBI

  • ‘Pinterest’ తరహాలో అందుబాటులోకి
  • ప్రస్తుతం యాపిల్ యూజర్లకు.. కొన్ని దేశాల వారికి మాత్రమే
  • త్వరలోనే అన్ని దేశాలకు.. ఆండ్రాయిడ్ యాప్ విడుదలకు ఏర్పాట్లు

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తన కొత్త యాప్ ‘HOBBI’ని విడుదల చేసింది. మనకు సంబంధించిన హాబీలను ఫొటోలు, వీడియోలుగా షేర్ చేసుకునేందుకు వీలుగా ఈ కొత్త యాప్ ను రూపొందించింది. ఇప్పటికే ఇదే తరహాలో అందుబాటులో ఉన్న ‘Pinterest’ యాప్ తరహాలో ‘HOBBI’ కూడా పనిచేస్తుంది.

ప్రస్తుతానికి యాపిల్ ఫోన్లకే..

ప్రస్తుతానికి ఇది కేవలం యాపిల్ ఐఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అన్నిదేశాల్లో దానిని విడుదల చేయలేదు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల వారికి యాపిల్ ఐస్టోర్ లో అందుబాటులో ఉంది. త్వరలోనే అన్ని దేశాల వారికి అందుబాటులోకి వస్తుందని.. ఆండ్రాయిడ్  యాప్ ను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

సైలెంట్ గా విడుదల..

ఫేస్ బుక్ కంపెనీలో భాగమైన ‘న్యూ ప్రొడక్ట్ ఎక్స్ పెరిమెంటేషన్ (ఎన్ పీఈ) టీమ్ ఆధ్వర్యంలో ఈ ‘HOBBI’ని రూపొందించినట్టుగా యాప్ డిస్క్రిప్షన్ లో పేర్కొన్నారు. పెద్దగా ప్రచారమేమీ లేకుండా సైలెంట్ గా ఈ యాప్ ను విడుదల చేశారు. దాంతో శుక్రవారం సాయంత్రం వరకు ‘HOBBI’ యాప్ ను ఐదువేల మంది మాత్రమే డౌన్ లోడ్ చేసుకున్నారు.

హాబీలను ఆర్గనైజ్ చేసుకునేందుకు..

‘HOBBI’ యాప్ మన హాబీలను, ఐడియాలను షేర్ చేసుకునే యాప్. మనకు ఇష్టమైన పనులు గార్డెనింగ్, వంట, ఆర్ట్స్, డెకరేషన్ ఇట్లాంటి హాబీలను ఓ క్రమంలో సెట్ చేసుకోవచ్చు. యూజర్లు తమ కలెక్షన్లు, ప్రాజెక్టులను ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ తోడ్పడుతుందని ఫేస్ బుక్ సంస్థ ప్రకటించింది. ఈ కలెక్షన్లు, ప్రాజెక్టులు పూర్తయ్యాక.. వీడియో హైలైట్ రీల్స్ రూపొందించుకోవచ్చని, వాటిని మరికొందరు యూజర్లతో షేర్ చేసుకోవచ్చని పేర్కొంది.

Facebook
HOBBI
Facebook New App
Pinterest
Apple store
Facebook released new app
Facebook HOBBI
  • Loading...

More Telugu News