Lakshmi Parvati: చంద్రబాబు అవినీతిపరుడని మొదటి నుంచీ చెబుతూనే ఉన్నా: లక్ష్మీపార్వతి

Lakshmi Parvathi slams TDP supremo Chandrababu

  • ఐటీ దాడుల నేపథ్యంలో లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు
  • రెండెకరాల నుంచి రూ.2 లక్షల కోట్లకు ఎదిగాడు
  • ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండిందని వెల్లడి

ఏపీలో ఐటీ దాడుల వ్యవహారంలో వైసీపీ నేతలంతా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. తాజాగా, వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి కూడా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతిపరుడని మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని అన్నారు. ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండిందని, అవినీతి భాగోతం అంతా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబు రెండెకరాల నుంచి రూ.2 లక్షల కోట్లకు ఎదిగాడని ఆరోపించారు. రాష్ట్ర సంపదను దోపిడీ చేసి, ప్రజలపై అప్పులభారం మోపాడని వ్యాఖ్యానించారు.

Lakshmi Parvati
Chandrababu
IT Raids
Telugudesam
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News