Justice Bhanumati: నిర్భయ కేసును విచారిస్తూ స్పృహ కోల్పోయిన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ భానుమతి

Supreme Court Judge Justice Bhanumati lost consciousness during Nirbhaya case hearing

  • తీర్పును వెలువరిస్తున్న సమయంలో కళ్లు తిరిగి పడిపోయిన జస్టిస్ భానుమతి
  • హుటాహుటిన ఛాంబర్ కు తీసుకెళ్లిన కోర్టు సిబ్బంది
  • కేసును వచ్చే వారానికి వాయిదా వేసిన ధర్మాసనం

ఈరోజు నిర్భయ కేసును విచారిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ భానుమతి అస్వస్థతకు గురయ్యారు. నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీసేందుకు అనుమతించాలంటూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై తీర్పును వెలువరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి కళ్లు తిరిగి ఆమె పడిపోయారు. దీంతో, కోర్టు హాల్లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కోర్టు సిబ్బంది ఆమెను హుటాహుటిన ఛాంబర్ కు తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించారు. కాసేపటి తర్వాత ఆమె స్పృహలోకి వచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేసును వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

మరోవైపు జస్టిస్ భానుమతి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఆరోగ్యం బాగోలేకపోయినా కేసు విచారణ నిమిత్తం వచ్చారని చెప్పారు. ఛాంబర్ లోనే ఆమెను వైద్యులు పరీక్షిస్తున్నారని తెలిపారు. దీనికి ముందే దోషి వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్ ను జస్టిన్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.

Justice Bhanumati
Supreme Court
Unconsciousness
Nirbhaya
  • Loading...

More Telugu News