Salman Khan: సల్మాన్ ఖాన్ ను కలిసేందుకు 600 కిలోమీటర్లు సైకిల్ పై వచ్చిన అభిమాని

Salman Khan Fan Cycles 600 Km To Meet The Star

  • ఐదు రోజుల్లోనే అంతదూరం తొక్కిన 52 ఏళ్ల భుపేన్ లిక్సన్
  • అస్సాంలోని  గువహటిలో 15న ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం
  • ఆ ప్రోగ్రామ్ కు వస్తున్న సల్మాన్ ను కలిసేందుకు అభిమాని ప్రయత్నం

తన అభిమాన హీరో సల్మాన్ ఖాన్ ను కలిసేందుకు 52 ఏళ్ల వయసున్న భూపేన్ లిక్సన్ 600 కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కాడు. అసోంలోని జగున్ గ్రామం నుంచి ఫిబ్రవరి 8న సైకిల్ తొక్కడం మొదలుపెట్టి 13వ తేదీన ఆ రాష్ట్రంలోని పెద్ద పట్టణం గువహటికి చేరుకున్నాడు. తాను సైకిల్ తొక్కుతున్న, సల్మాన్ సైకిల్ తొక్కుతున్న ఫొటోలను ప్రింట్ చేసిన ఓ పోస్టర్ ను సైకిల్ కు పెట్టుకుని తన అభిమానాన్ని చాటాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సల్మాన్ ఫిలింఫేర్ ప్రోగ్రామ్ కు వస్తుండటంతో..

అసోంలోని గువహటిలో ఈ నెల 15న ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. సల్మాన్ ఖాన్ ఆ ప్రోగ్రాంలో పాల్గొననున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భూపేన్.. తమ గ్రామం నుంచి సైకిల్ పై గువహటికి బయలుదేరాడు. ఐదు రోజుల్లోనే 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి.. 13న సాయంత్రం నగరానికి చేరుకున్నాడు.

భూపేన్ సైక్లింగ్ చాంపియనే..

భూపేన్ యుక్త వయసులో ఉన్నప్పుడు అసోంలో సైక్లింగ్ చాంపియన్. తన పేరిట కొన్ని రికార్డులు కూడా ఉన్నాయి. అయితే 52 ఏళ్ల వయసులో ఏకంగా 600 కిలోమీటర్లుపైగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం ఆసక్తిగా మారింది.

Salman Khan
Salman Khan fan
cycles 600 kilometres
filmfare awards
salman fan cycles 600 km to meet the star
  • Loading...

More Telugu News