Arvind Kejriwal: ప్రమాణస్వీకారానికి మోదీని ఆహ్వానించిన కేజ్రీవాల్

Arvind Kejriwal Invites PM Modi To His Swearing In

  • రేపు ప్రమాణస్వీకారం చేయనున్న కేజ్రీవాల్
  • ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం
  • ఎవరినీ ఆహ్వానించబోమని నిన్న ప్రకటించిన ఆప్

ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఆదివారం నాడు మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా ప్రధాని మోదీని కేజ్రీవాల్ కోరారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ, ఇతర రాష్ట్రాల నేతలను కానీ తమ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడం లేదని నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మోదీకి కేజ్రీవాల్ ఆహ్వానం పలకడం విశేషం. మరి కేజ్రీవాల్ ఆహ్వానం మేరకు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి మోదీ వస్తారా? లేదా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో 51 ఏళ్ల కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Arvind Kejriwal
AAP
Narendra Modi
BJP
Swearing in Ceremony
  • Loading...

More Telugu News