GST: జీఎస్టీ పన్ను నోటీసులపై కోర్టును ఆశ్రయించిన సంగీత దర్శకుడు రెహ్మాన్

A R Rehaman challenge in the madras High Court on GST

  • ఎటువంటి పన్నులైనా కొనుగోలుదారులదే బాధ్యతని స్పష్టీకరణ
  • నాకు నోటీసులు జారీ చేయడం చట్ట విరుద్ధం 
  • మార్చి 4వ తేదీకి విచారణ వాయిదా వేసిన మద్రాస్ హైకోర్టు

తాను సేవా పన్ను బకాయి ఉన్నానంటూ జీఎస్టీ కమిషనర్ నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్  మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన పాటలపై సినీ నిర్మాతలకు పేటెంటు హక్కులు ఇచ్చిన తర్వాత దానిపై ఎటువంటి పన్నులు చెల్లించాల్సి వున్నా వారిదే బాధ్యతని స్పష్టం చేశాడు. అందువల్ల తనకు నోటీసులు జారీ చేయడం చట్ట విరుద్ధమని కోర్టుకు తెలిపాడు. పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి రెహ్మాన్‌కు పంపిన నోటీసుపై మార్చి 4వ తేదీ వరకు ఎటువంటి చర్య తీసుకోవద్దని ఆదేశిస్తూ స్టే విధించారు. అలాగే ఈ పిటిషన్ పై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని జీఎస్టీ కమిషనర్‌ను ఆదేశించారు.

GST
commissioner
notices
ARRehman
madras high court
  • Loading...

More Telugu News