Budda Venkanna: చదవడం వచ్చిన వారితో ఐటీ ప్రెస్ నోట్ ను చదివించుకోండి: బుద్దా వెంకన్న కౌంటర్

Read the IT press note with those who read says Budda Venkanna

  • చంద్రబాబు మాజీ పీఎస్ వద్ద రూ. 2 వేల కోట్లు దొరికాయని తెగ సంబరపడిపోతున్నారు
  • ఇంగ్లీష్ నేర్చుకోవాల్సింది జగన్, వైసీపీ నేతలే అనే విషయం అర్థమవుతోంది
  • బ్లాక్ పేపర్, ఛానలో వార్తలు చూస్తుంటే నవ్వొస్తోంది

చంద్రబాబు మాజీ పీఎస్ దగ్గర ఐటీ దాడుల్లో రూ. 2 వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. దో నెంబర్ దందాతో నడిచే బ్లాక్ పేపర్, బ్లాక్ ఛానల్ లో ఐటీ దాడులకు సంబంధించిన వార్తలను చూస్తుంటే నవ్వొస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులంతా చంద్రబాబు హయాంలోనే ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలు పెట్టారని చెప్పారు. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సింది ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతలు మాత్రమేననే విషయం అర్థమవుతోందని అన్నారు. 40 చోట్ల ఐటీ రెయిడ్స్ జరిగితే దొరికింది కేవలం రూ. 87 లక్షలు మాత్రమేనని చెప్పారు.

'మూడు ఇన్ఫ్రా కంపెనీలపై కూడా దాడి చేశామని ఐటీ అధికారులు ప్రకటన ఇచ్చారు. బోడి గుండుకి, మోకాలికి ముడి పెట్టినట్టు... ఇన్ఫ్రా కంపెనీల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించామని ఐటీ అధికారులు అంటే... చంద్రబాబు మాజీ పీఎస్ వద్ద రూ. 2 వేల కోట్లు దొరికేశాయని వైసీపీ నేతలు తెగ సంబరపడిపోతున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్ నోట్ ను చదవడం వచ్చిన వాళ్లతో చదివించుకోవాలని కోరుతున్నానని సూచించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.

Budda Venkanna
Chandrababu
Telugudesam
Jagan
ysrcp
IT Raids
  • Loading...

More Telugu News