Suryapet District: బీమా డబ్బు కోసం బాబాయ్‌ను బొలెరో వాహనంతో ఢీ కొట్టి చంపిన యువకుడు

man murdered in suryapet

  • సూర్యాపేటలో దారుణ ఘటన
  • తాడ్వాయికి చెందిన మంజుల సైదులు అనుమానాస్పద మృతి 
  • నిజాలను తేల్చిన పోలీసులు
  • నిందితుడికి సహకరించిన మరో ఇద్దరి అరెస్టు

సూర్యాపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బీమా డబ్బు కోసం సొంత బాబాయ్‌ను హత్య చేశాడో యువకుడు. ఇటీవల మునగాల మండలం తాడ్వాయికి చెందిన మంజుల సైదులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మునగాల పోలీసులు దర్యాప్తు జరిపి, నిజాలను తేల్చారు.

నిందితులను మునగాల సీఐ శివ శంకర్‌ గౌడ్ ఈ రోజు ఉదయం మీడియా ముందు హాజరుపర్చి, కేసు వివరాలను వివరించారు. పది రోజుల క్రితం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని చెప్పారు. అన్ని కోణాల్లోనూ విచారణ జరపగా, సొంత బాబాయ్‌ను రమేశ్ అనే యువకుడే హత్య చేశాడని తేలిందన్నారు

సైదులును అతడి సోదరుడి కుమారుడు రమశ్ బొలెరో వాహనంతో ఢీ కొట్టి చంపినట్లు నిర్ధారించుకున్నామని తెలిపారు. బీమా డబ్బు కోసమే అతడు ఈ దారుణ ఘటనకు పాల్పడినట్లు వెల్లడించారు. రమేశ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసినట్లు చెప్పారు.

Suryapet District
Crime News
  • Loading...

More Telugu News