Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Samantha clarifies her statement on retirment

  • రిటైర్మెంట్ పై సమంత వివరణ 
  • ప్రభాస్ కు విలన్ గా జగపతి 
  • హిందీలోకి సూపర్ హిట్ సినిమా

 *  మరో రెండు, మూడేళ్లలో తాను సినిమాల నుంచి తప్పుకుంటానంటూ ఇటీవల కథానాయిక సమంత స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి విదితమే. అయితే, దీనిపై తాజాగా మరింతగా వివరణ ఇచ్చింది. తాను పూర్తిగా రిటైర్ అవుతానని అనలేదనీ, గత దశాబ్దం నుంచి నటిగా రాణించడం కష్టంతో కూడుకున్నదని అని మాత్రమే అన్నానని చెప్పింది. ఇండస్ట్రీని వదిలి వెళ్లేది లేదనీ, ఒకవేళ ఆర్టిస్టుగా కాకపోయినా మరో విధంగానైనా ఇక్కడ కొనసాగుతానని చెప్పింది.  
*  ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. కాగా ఇందులో ప్రముఖ నటుడు జగపతిబాబు విలన్ గా కీలక పాత్రను పోషిస్తున్నట్టు తాజా సమాచారం. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 'ఓ డియర్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.
*  అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇటీవల వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం సూపర్ హిట్టయిన సంగతి విదితమే. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ఆలోచిస్తున్నారట. దీనికి తగ్గా స్టార్ హీరో కోసం ఆయన బాలీవుడ్ లో వెతుకుతున్నట్టు సమాచారం.  

Samantha
Prabhas
Jagapathi Babu
Allu Arjun
  • Loading...

More Telugu News