Jagan: మళ్లీ రేపు ఢిల్లీకి సీఎం జగన్ !

CM Jagan will go to Delhi tomorrow again

  • కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్న సీఎం
  • రేపు సాయంత్రం 6 గంటలకు భేటీ
  • అమిత్ షాతో పలు అంశాలపై చర్చించనున్న జగన్

నిన్ననే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసిన ఏపీ సీఎం జగన్ మరోమారు హస్తినకు వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఆయన ఢిల్లీ వెళుతున్నట్టు సమాచారం. రేపు సాయంత్రం 6 గంటలకు అమిత్ షా ను కలిసి, పలు అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది.

కాగా, వాస్తవానికి అమిత్ షాను జగన్ ఇవాళ కలవాల్సి ఉంది. అయితే, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించే పనిలో ఉన్న అమిత్ షా బిజీగా ఉన్నారు. దీంతో, అమిత్ షాతో జగన్ భేటీకి అవకాశం లభించలేదు. తాజాగా కేంద్ర హోం శాఖ నుంచి సీఎం కార్యాలయానికి కబురు అందడంతో అమిత్ షాను కలిసేందుకు జగన్ రేపు ఢిల్లీ కి పయనమవుతున్నట్టు సమాచారం.

Jagan
YSRCP
Delhi
Amit Shah
/Central Home Minister
  • Loading...

More Telugu News