Rishi Sunak: బ్రిటన్ ఆర్థికమంత్రిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్

Rishi Sunak Appointed as Britain Finance Minister

  • ఇంగ్లాండ్ లోని హాంప్ షైర్ లో జన్మించిన రిషి
  • రెండోసారి మంత్రిపదవి చేపడుతున్న రిషి
  • 2015లో తొలిసారిగా ఎంపీగా గెలుపు

బ్రిటన్ కొత్త ఆర్థిక మంత్రిగా భారత సంతతికి చెందిన వ్యక్తి రిషి సునక్(39ఏళ్లు) నియమితుడయ్యారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి ఈయన స్వయానా అల్లుడు. ప్రస్తుత ఆర్థిక మంత్రి సజిద్ జావిద్ పదవికి రాజీనామా చేయడంతో రిషి సునక్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. రిషి సునక్ ప్రస్తుతం ట్రెజరీ విభాగానికి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

2014లో రాజకీయాల్లోకి వచ్చిన రిషి మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందాడు. రిషి మంత్రిగా పనిచేయడం ఇది రెండోసారి. గతంలో థెరిసా మే ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఇంగ్లాండ్ లోని హాంప్ షైర్ లో జన్మించిన రిషి సునక్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీనుంచి డిగ్రీ పట్టా నందుకున్నారు.

Rishi Sunak
Son in Law of Narayanmurthy
Infosys
Britain
Finance Minister
  • Loading...

More Telugu News