Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో రూ.2 వేల కోట్లకు పైగా అవకతవకలు గుర్తించామని ఐటీ శాఖ ప్రకటన

IT Department declared that we conducted raids in telugu states

  • ఏపీ, తెలంగాణలోని మూడు ఇన్ ఫ్రా కంపెనీల్లో సోదాలు చేశాం
  • ఈ సోదాల్లో కీలక పత్రాలు లభించాయి
  • 25కు పైగా బ్యాంకు లాకర్లను సోదాల్లో గుర్తించాం

తెలుగు రాష్ట్రాల్లో తాజాగా జరిగిన సోదాలపై ఆదాయపు పన్ను శాఖ ఓ ప్రకటన చేసింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, కడప, ఢిల్లీ, పూణె సహా నలభై ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించినట్టు పేర్కొంది. ఏపీ, తెలంగాణలలో రూ.2 వేల కోట్లకు పైగా అవకతవకలను గుర్తించామని పేర్కొంది. ఏపీ, తెలంగాణలోని మూడు ఇన్ ఫ్రా కంపెనీల్లో సోదాలు చేశామని, ఆయా కంపెనీల్లో నకిలీ బిల్లులు గుర్తించామని, ఈ సోదాల్లో కీలక పత్రాలు లభించాయని పేర్కొంది. లెక్కలు చూపని రూ.85 లక్షల నగదు, రూ.71 లక్షల ఆభరణాలు లభ్యమయ్యాయని, పలువురికి చెందిన 25కు పైగా బ్యాంకు లాకర్లను సోదాల్లో గుర్తించినట్టు వివరించింది. ఏపీలో ఓ ప్రముఖుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి నివాసంలోనూ తనిఖీలు చేశామని తమ ప్రకటనలో ఐటీ శాఖ వివరించింది.

  • Loading...

More Telugu News