Mount Merapi: ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం.. భారీగా ఎగిసిపడుతున్న లావా

Mount Merapi Volcano Spews Ash Lava

  • రెండు కిలోమీటర్ల ఎత్తున పొగ
  • చుట్టూ పది కిలోమీటర్ల విస్తీర్ణంలో దుమ్ము, ధూళి
  • హై అలర్ట్ ప్రకటించిన అధికారులు

ప్రపంచంలోని పెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటైన ఇండోనేషియాలోని మౌంట్ మెరపి గురువారం బద్దలైంది. భారీ ఎత్తున లావా ఉప్పొంగుతోంది. రెండు కిలోమీటర్ల (6,500 ఫీట్ల) ఎత్తున దుమ్ము, పొగ కమ్ముకుంది. సుమారు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో బూడిద, దుమ్ము వర్షంలా కురుస్తున్నాయి. దాంతో ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించే విమానాలను దారి మళ్లించారు. జాగ్రత్తగా ఉండాలని సమీపంలోని ప్రజలను హెచ్చరించారు. అగ్నిపర్వతానికి చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలోని డేంజర్ జోన్ పరిధిలోకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.

ఎనిమిదేళ్ల కిందట 300 మందిని బలిగొంది

మౌంట్ మెరపి అగ్నిపర్వతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మీద ఉండే యాక్టివ్ వల్కనోల్లో ఒకటి. ఇది ఎప్పుడైనా పేలే అవకాశం ఉందని సైంటిస్టులు గుర్తించారు. ఇది 2010లో బద్దలైనప్పుడు తీవ్రంగా నష్టం కలిగించింది. మూడు వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దానికి సమీపంగా ఉన్న గ్రామాలు, పట్టణాల నుంచి మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News