Karthikeya: 'చావు కబురు చల్లగా' చెప్పే బస్తీ బాలరాజు .. షూటింగు మొదలు
- కార్తికేయ నుంచి మరో మాస్ మూవీ
- దర్శకుడిగా కౌశిక్
- నిర్మాతగా బన్నీ వాసు
ఒక వైపున మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేస్తూనే, మరో వైపున నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేయడానికి కార్తికేయ ఉత్సాహాన్ని చూపుతున్నాడు. నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరో కథే 'చావుకబురు చల్లగా'.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై కౌశిక్ దర్శకుడిగా ఈ రోజునే ఈ సినిమా షూటింగు మొదలైంది. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో 'బస్తీ బాలరాజు' పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. శవాలను శ్మశానానికి తీసుకెళ్లే వాహనంపై నుంచుని దమ్ముకొడుతూ ఆయన కనిపిస్తున్నాడు. గళ్ల షర్టు పైకి మడిచి .. లుంగీ పైకి కట్టి పూర్తి మాస్ లుక్ తో ఆయన వున్నాడు. ఈ సినిమాకి జాక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.