Doctor Ravindranath: పోలీస్ స్టేషన్ నుంచి పరారైన డాక్టర్ రవీంద్రనాథ్

Doctor Ravindranath escapes from Police Station
  • ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డీడీవోగా పని చేస్తున్న రవీంద్రనాథ్
  • నర్సులను లైంగికంగా వేధిస్తున్న వైనం
  • నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు
ఉదయగిరి పోలీస్ స్టేషన్ లో పోలీసుల కళ్లుగప్పి డాక్టర్ రవీంద్రనాథ్ తప్పించుకున్నారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. స్టాఫ్ నర్స్ ను లైంగికంగా వేధించిన కేసులో రవీంద్రనాథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్రమత్తమైన పోలీసులు డాక్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డీడీవోగా రవీంద్రనాథ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే, అక్కడ పని చేస్తున్న నర్సులతో ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఓ నర్సును రాత్రివేళ పిలిచి అత్యాచారయత్నం చేయడంతో ఈ డాక్టర్ గారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో, నర్సు బంధువులు వచ్చి రవీంద్రనాథ్ కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిన్న రవీంద్రనాథ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పీఎస్ కు తరలించారు. అయితే, పోలీసుల కళ్లుగప్పి ఆయన తప్పించుకోవడంతో కలకలం రేగింది.
Doctor Ravindranath
Udayagiri
Police Station
Escape

More Telugu News