Corona Virus: కోవిడ్ కేసులు తగ్గుతున్నట్టు ప్రకటించిన చైనా వైద్యులు.. విమర్శిస్తున్న అంతర్జాతీయ నిపుణులు!

China doctors says Covid 2019 cases decrease gradually

  • జనవరి తర్వాత కేసులు తగ్గుముఖం
  • ఏప్రిల్ నాటికి వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందన్న వైద్యులు
  • తొందరపాటు ప్రకటనలొద్దంటున్న నిపుణులు

చైనా వైద్యులు ఊరటనిచ్చే ప్రకటన చేశారు. కోవిడ్-2019 కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు ప్రకటించారు. జనవరి తర్వాత తొలిసారి కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టినట్టు చెప్పిన వైద్యులు.. ఏప్రిల్ చివరినాటికి కోవిడ్ ప్రభావం పూర్తిగా మాయమవుతుందని తెలిపారు. అయితే, ఈ ప్రకటన అంతర్జాతీయ నిపుణులను మెప్పించలేకపోతోంది. కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ వచ్చేందుకు మరో 18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వైరస్‌ను నంబర్ వన్ ప్రజాశత్రువుగా పరిగణించాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చైనా ఇలాంటి ప్రకటన చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

చైనాలో ఇప్పటి వరకు 44,653 కేసులు నమోదు కాగా, ఒక్క మంగళవారం నాడే 2015 కేసులు నమోదయ్యాయి. అయితే, గత నెలతో పోలిస్తే ఇవి చాలా తక్కువని, దీనిని బట్టి చూస్తే ఏప్రిల్ చివరినాటికి వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. చైనా వైద్యుల ప్రకటనపై ఆస్ట్రేలియా వైద్యులు కూడా స్పందించారు. ఈ విషయంలో ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందన్న వైద్యులు.. వైరస్ నివారణ కోసం చైనా చేస్తున్న కృషిని మాత్రం ప్రశంసించారు.

  • Loading...

More Telugu News