Jagan: ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం జగన్

AP CM Jagan meets PM Modi

  • ఈరోజు సాయంత్రం మోదీని కలిసిన జగన్
  • ‘ప్రత్యేక హోదా’, ప్రాజెక్టులకు నిధులు మొదలైన అంశాలపై చర్చ
  • జగన్ వెంట ఉన్న వైసీపీ ఎంపీలు

ఏపీ సీఎం జగన్ ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తన ఒక్క రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఈరోజు సాయంత్రం భేటీ అయ్యారు. ప్రధానికి పుష్పగుచ్ఛం అందజేసిన జగన్ ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ఏపీకి ‘ప్రత్యేక హోదా’, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల అమలు, రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, మండలి రద్దు తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. జగన్ వెంట వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, గోరంట్ల మాధవ్ తదితరులు ఉన్నారు..

Jagan
YSRCP
Narendra Modi
Prime Minister
Delhi
One day tour
  • Loading...

More Telugu News