Nirbhaya: పటియాలా కోర్టు హాల్లో భోరున విలపించిన నిర్భయ తల్లి

Nirbhaya mother breaks down in court

  • నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లు దాటిపోయింది
  • దోషులకు డెత్ వారెంట్లు ఇవ్వండి
  • మా హక్కుల సంగతి ఏమిటి?

నిర్భయ హంతకుల ఉరితీత విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆమె తల్లి ఆశాదేవి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పటియాలా కోర్టు హాల్లో విచారణ సందర్భంగా భోరున విలపించారు. హంతకులకు వెంటనే డెత్ వారెంట్లు జారీచేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని కంటతడి పెట్టారు. తాను కూడా మనిషినేనని, తమ హక్కుల సంగతి ఏమిటని ఆమె ప్రశ్నించారు. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లకు పైగా అయిపోయిందని ఆమె అన్నారు. ఈ కేసులో దోషులైన పవన్, ముఖేశ్, అక్షయ్, వినయ్ ల ఉరితీతకు కొత్త డెత్ వారెంట్లు ఇవ్వాలంటూ నిర్భయ తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

Nirbhaya
Mother
Patiyala House Court
  • Loading...

More Telugu News