Telangana high court: తదుపరి ఉత్తర్వుల వరకూ సచివాలయ భవనాలు కూల్చొద్దు: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
- నూతన సచివాలయం నిర్మాణంపై కేబినెట్ తుది నమూనాను కోరిన న్యాయస్థానం
- నివేదికను పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేదన్న అదనపు ఏజీ
- సచివాలయంలోని భవనాల కూల్చివేతపై తొందర ఎందుకు? అని ప్రశ్నించిన హైకోర్టు
తెలంగాణలోని సచివాలయంలో భవనాల కూల్చివేతలపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.
నూతన సచివాలయం నిర్మాణంపై కేబినెట్ తుది నమూనా నివేదికను తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నివేదికను పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేదని కోర్టుకు అదనపు ఏజీ తెలిపారు. ఎలాంటి డిజైన్లు సిద్ధం కానప్పుడు సచివాలయంలోని భవనాల కూల్చివేతపై తొందర ఎందుకు? అని న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ సచివాలయంలోని భవనాలను కూల్చవద్దని ఆదేశాలు జారీ చేసింది.