Jagan: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరిన సీఎం జగన్

Jagan leaves for Delhi

  • గన్నవరం నుంచి ఢిల్లీకి బయల్దేరిన జగన్
  • సాయంత్రం మోదీతో భేటీ
  • అనంతరం విజయవాడకు తిరుగుపయనం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాసేపటి క్రితం విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి... అక్కడి నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో జగన్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని వద్ద జగన్ ప్రస్తావించనున్నారు. సమావేశానంతరం ఢిల్లీ నుంచి విజయవాడకు తిరుగుపయనం కానున్నారు.

Jagan
YSRCP
Narendra Modi
BJP
Delhi tour
  • Loading...

More Telugu News