వరుస ఫ్లాపులు .. ఆలోచనలో పడిన శర్వానంద్
- కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే శర్వానంద్
- 'జాను'పై పెట్టుకున్న నమ్మకం
- వరుసగా మూడు పరాజయాలు
ఇంతకుముందు శర్వానంద్ చేసిన 'పడి పడి లేచే మనసు'.. 'రణరంగం' సినిమాలు నిరాశపరిచాయి. తమిళ .. కన్నడ భాషల్లో ఆదరణ పొందిన కథే కదా అనే నమ్మకంతో 'జాను' చేస్తే అది కూడా పరాజయాన్ని చవిచూసింది. ఇలా వరుసగా మూడు పరాజయాలు ఎదురుకావడంతో శర్వానంద్ ఆలోచనలో పడినట్టుగా సమాచారం. ఇకపై కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు.