ciggarete: పొగబెట్టిన సిగరెట్టు... ఎగ్జిబిషన్ మైదానంలో గొడవ!

Woman attacked security at exibition

  • సెక్యూరిటీ సిబ్బందిపై యువతి దాడి 
  • పెట్టెతో రావద్దన్నందుకు ఆగ్రహం 
  • యువతిని అదుపులోకి తీసుకున్న బేగంబజార్ పోలీసులు

సిగరెట్ పెట్టె ఎగ్జిబిషన్ మైదానం వద్ద ఘర్షణకు కారణమైంది. అగ్నిప్రమాద హేతువులు కాబట్టి సిగరెట్లతో మైదానంలోకి వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది అంగీకరించలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఓ యువతి వారిపై దాడికి దిగడంతో చివరికి వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.

బేగంబజార్ పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఖుష్ లోహియా (24) తల్లితో కలిసి నిన్న నాంపల్లిలో జరుగుతున్న ఎగ్జిబిషన్ మైదానానికి వచ్చారు. ప్రవేశద్వారం వద్ద మహిళా సిబ్బంది ఆమెను తనిఖీ చేసి సిగరెట్ పెట్టె ఉండడంతో అనుమతించ లేదు. దీంతో ఆమెకు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య వాగ్వాదం మొదలయ్యింది.

ఆ సందర్భంగా ఆగ్రహోదగ్రురాలైన ఆ యువతి భద్రతా సిబ్బందిపై దాడికి దిగింది. దీంతో సిబ్బంది ఆమెపై బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఘర్షణకు కారణం విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు.

ciggarete
Hyderabad
nampalli
exibition
  • Loading...

More Telugu News