Corona Virus: కరోనాకు కొత్తపేరు పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

WHO changed corona virus name as covid 2019

  • కరోనా ఇక నుంచి ‘కోవిడ్-2019’
  • కరోనా అంటే కొన్ని వైరస్‌ల సమూహం
  • ఆ గందరగోళాన్ని తొలగించేందుకే కొత్త పేరు

ప్రపంచాన్ని గడగడలాడిస్తూ వందలాదిమంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా వైరస్ పేరు మారింది. ప్రమాదకర ఈ వైరస్‌కు ‘కోవిడ్-2019’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొత్త పేరు పెట్టింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ టెడ్రస్ అదానోమ్ తెలిపారు. కోవిడ్-19 (covid-2019)  అంటే ‘కరోనా వైరస్ డిసీజ్ 2019’ అని అర్థమని పేర్కొన్నారు. కొన్ని వైరస్‌ల సమూహానికి కరోనా అని పేరు ఉందని, దాంతో ఈ గందరగోళాన్ని తొలగించేందుకే కొత్త పేరు పెట్టినట్టు తెలిపారు. ఈ పేరు స్వతంత్రంగా ఏ ఒక్కదానినీ సూచించదని పేర్కొన్న టెడ్రస్.. ఈ కొత్త పేరు ఆ వ్యాధిని గురించి మాత్రమే తెలియజేస్తుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News