Pawan Kalyan: సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan condolences over Pasupaleti Demise
  • పసుపులేటి మరణ వార్త బాధకు గురి చేసింది
  • ఆయనతో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది
  • తెలుగు సినిమాపై పసుపులేటి పలు రచనలు చేశారు
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు మృతిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను బాధకు గురి చేసిందని అన్నారు. పసుపులేటితో తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని, వామపక్ష భావాలు కలిగిన ఆయన మృదు స్వభావి అని అన్నారు. తెలుగు సినిమాపై పలు రచనలు చేసి సినీ చరిత్రకు అక్షర రూపం ఇవ్వడంలో ఆయన తన వంతు పాత్రను పోషించారని ప్రశంసించారు. రామారావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Pawan Kalyan
janasena
pasupuleti
Film Journalist

More Telugu News