Arvind Kejriwal: కేజ్రీవాల్ ఘన విజయంపై మూడు ముక్కల్లో స్పందించిన నితీశ్ కుమార్

Nitish Kumar responds on AAP victory

  • ఘన విజయం దిశగా దూసుకుపోతున్న ఆప్
  • కేజ్రీవాల్ కు వెల్లువెత్తుతున్న అభినందనలు
  • ఓటర్లే రాజులు అన్న నితీశ్ కుమార్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 70 సీట్లున్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం 60 సీట్లను ఆప్ కైవసం చేసుకోబోతోంది. మిగిలిన 10 స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది. ఈ నేపథ్యంలో, కేజ్రీవాల్ కు దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. 'జనతా మాలిక్ హై (ఓటర్లే రాజులు)' అంటూ ఆయన మూడు ముక్కల్లో తన స్పందనను తెలియజేశారు. బీజేపీతో ఉన్న పొత్తు నేపథ్యంలో, ఢిల్లీలో రెండు స్థానాల్లో నితీశ్ కు చెందిన జేడీయూ పోటీ చేసింది. మూడు స్థానాల్లో నితీశ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. అమిత్ షాతో కలసి చేసిన ప్రచారంలో నితీశ్ కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై తీవ్ర విమర్శలే గుప్పించారు. కేజ్రీవాల్ కేవలం ఉచితంగా ఇచ్చే వాటిపైనే మాట్లాడుతున్నారని... వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదని వ్యాఖ్యానించారు.

Arvind Kejriwal
Nitish Kumar
AAP
JDU
Delhi Elections
  • Loading...

More Telugu News