Coronavirus: దుబాయ్ లో ఇండియన్ కు కరోనా వైరస్.. అధికారికంగా ప్రకటించిన డాక్టర్లు

  • కరోనా వైరస్ ఉన్న వారితో కలిసి ఉండటంతో ఇన్ఫెక్షన్
  • పేరు, వివరాలు ప్రకటించని అధికారులు
  • ఇప్పటివరకు దుబాయ్ లో ఆరుగురు చైనీస్ సహా ఎనిమిది మందికి వైరస్
దుబాయ్ లో పనిచేస్తున్న ఒక ఇండియన్ కు కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయిందని అక్కడి డాక్టర్లు ప్రకటించారు. ఇప్పటికే వైరస్ సోకిన మరొకరితో కలిసి ఉండటంతో అతడికి వైరస్ సోకిందని తెలిపారు. అయితే ఆ ఇండియన్ పేరు, ఇతర వివరాలను వెల్లడించలేదు.

ఎనిమిది మంది బాధితులు

తమ దేశంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ పై యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ట్వీట్ చేసింది. ‘‘వైరస్ సోకిన వ్యక్తితో కలిసి ఉన్న ఒక ఇండియన్ కు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. దీనితో యూఏఈలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వైరస్ సోకినట్టుగా అనుమానమున్న మరికొందరిని ఆసుపత్రులలో చేర్చి పరీక్షలు చేస్తున్నాం’’ అని ప్రకటించింది. దుబాయ్ లో కరోనా వైరస్ సోకిన ఎనిమిది మందిలో ఆరుగురు చైనా వాళ్లు, ఒకరు ఫిలిపినో, ఒకరు ఇండియన్  అని అధికారులు తెలిపారు.
Coronavirus
uae
dubai
indian
virus infection

More Telugu News