Corona Virus: కరోనా ప్రభావం.. ఆత్మహత్యాయత్నం చేసిన గాంధీ ఆసుపత్రి వైద్యుడు

Sspended Gandhi Hospital doctor suicide attempt
  • కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయంటూ వార్తలు
  • డాక్టర్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
  • అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ డాక్టర్ ఆత్మహత్యాయత్నం
హైదరాబాదులో కూడా కరోనా వైరస్ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో ఎంతో మంది కరోనా అనుమానాలతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ పరీక్షల్లో అన్ని కేసులు నెగెటివ్ అనే తేలినా... పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయంటూ లీకులు వెలువడ్డాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యునిగా భావిస్తూ డాక్టర్ వసంత్ కుమార్ ను సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు డాక్టర్లకు హెచ్చరికలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో వసంత్ కుమార్ హల్ చల్ చేశారు. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ పెట్రోల్ డబ్బా పట్టుకొచ్చి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో, తోటి వైద్య సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు.
Corona Virus
Gandhi Hospital
Doctor
Suicide Attempt

More Telugu News