Budda Venkanna: చివరకు ఇలా చెప్పుకునే దుస్థితికొచ్చారు.. జగన్, ఫినాయిల్ రెడ్డి గార్లని చూస్తే జాలేస్తోంది: బుద్ధా వెంకన్న

budda venkanna fires on jagan vijay sai reddy
  • 151 గెలిచామని కాలర్ ఎగరేశారు
  • ప్రతిపక్ష నాయకుడు  మీడియాను మేనేజ్ చేస్తున్నారంటున్నారు
  • వైసీపీ విధానాలు ఎంత చెత్తగా ఉన్నాయో అర్థం అవుతుంది 
అంతర్జాతీయ పత్రికలనే మేనేజ్‌ చేయగలిగిన వారికి జాతీయ పత్రికలు ఒక లెక్కా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

'వైఎస్ జగన్, ఫినాయిల్ రెడ్డి గార్లని చూస్తే జాలి వేస్తుంది. 151 గెలిచామని కాలర్ ఎగరేసిన 8 నెలల్లోనే ప్రతిపక్ష నాయకుడు అంతర్జాతీయ, జాతీయ మీడియాని మేనేజ్ చేసి వార్తలు రాయిస్తున్నారు అని చెప్పుకునే దుస్థితికి వచ్చారంటేనే మీ నిర్ణయాలు, విధానాలు ఎంత చెత్తగా ఉన్నాయో అర్థం అవుతుంది' అని బుద్ధా వెంకన్న అన్నారు.

 'ప్రజాధనం కొట్టేసి బ్లాక్ పేపర్, ఛానల్ పెట్టి అక్రమ సామ్రాజ్యాన్ని నెలకొల్పి పత్రికా విలువలను పాతాళానికి తోక్కేసిన జగన్ గారు, ఫినాయిల్ రెడ్డి పత్రికల గురించి మాట్లాడితే నమ్మే అమాయకులు ఇంకా ఉన్నారు అనుకోవడం అవివేకమే' అని ట్వీట్లు చేశారు.
Budda Venkanna
Telugudesam
Vijayawada
Twitter

More Telugu News