Varun Sandesh: వరుస ఫ్లాపుల వల్లనే గ్యాప్ తీసుకున్నాను: వరుణ్ సందేశ్

Varun Sandesh says he has taken gap due to flops
  • నా తొలి సినిమా 'హ్యాపీడేస్'
  • సోలో హీరోగా చేసిన సినిమా 'కొత్త బంగారు లోకం'
  • మంచి కంటెంట్ ఉంటేనే చేస్తానన్న వరుణ్ సందేశ్   
తెలుగులో తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్, ఆ తరువాత వరుస పరాజయల కారణంగా వెనుకబడ్డాడు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇదే విషయాన్నిగురించి ప్రస్తావించాడు.

"తెలుగులో నా తొలి సినిమా 'హ్యాపీడేస్' .. సోలో హీరోగా చేసిన సినిమా 'కొత్త బంగారు లోకం'. ఈ సినిమా నాకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఆ తరువాత అవకాశాలు వచ్చాయిగానీ విజయాలు దక్కలేదు. చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయం పాలవుతూ వచ్చాయి. దాంతో కాలం కలిసి రావడం లేదు .. ఈ సమయంలో నేను ఏ సినిమా చేసినా ఫ్లాపు అవుతుందని భావించి గ్యాప్ తీసుకున్నాను. పారితోషికం ఇవ్వకపోయినా ఫరవాలేదు .. మంచి కంటెంట్ మాత్రం ఉండాలి. అలాంటి కథ వచ్చినప్పుడే చేద్దామనే ఉద్దేశంతో, కొంతకాలం పాటు అమెరికాలో ఉండిపోయాను" అని చెప్పుకొచ్చాడు.
Varun Sandesh
Kottha Bangaru Lokam Movie
Vithika Sheru

More Telugu News