Chandrababu: సుదీర్ఘ సోదాలు... చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ నుంచి కీలక సమాచారం సేకరణ!

IT Raids on Chandra Babu Ps Srinivas completed after fifth day

  • ఐదు రోజుల క్రితం మొదలైన సోదాలు
  • నిన్నటితో ముగిసిన సోదాలు
  • రాష్ట్రవ్యాప్తంగా చర్చ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద గతంలో పర్సనల్ సెక్రెటరీగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాలు ఎట్టకేలకు ఐదో రోజున ముగిశాయి. మామూలుగా అయితే, ఐటీ దాడులు ఒక రోజు లేదా రెండు రోజులు జరుగుతాయి. కానీ చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐదు రోజుల పాటు సోదాలు జరగడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. దీన్ని బట్టి ఎంత సమాచారం ఐటీ అధికారుల వద్ద లేకుంటే, ఇన్ని రోజుల సోదాలు జరుగుతాయని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు.

విజయవాడలో శ్రీనివాస్ నివాసం ఉంటున్న కంచుకోట ప్లాజా నుంచి ఐటీ అధికారులు ఏమి స్వాధీనం చేసుకున్నారు? ముఖ్యంగా లాకర్ లో వీరికి ఏం లభ్యమైంది? అందులోని డైరీలు, హార్డ్ డిస్క్ లలో ఏం లభించిందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. శ్రీనివాస్ ఇంటితో పాటు లోకేశ్ సన్నిహితుడైన కిలారు రాజేష్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కు చెందిన అవెక్సా కార్పొరేషన్, వైఎస్ఆర్ జిల్లా టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డికి చెందిన ఆర్కే ఇన్ ఫ్రాల్లో కూడా  ఐటీ సోదాలు జరిగాయి. ఈ విచారణలో కీలక సమాచారం వెల్లడైనట్టు సమాచారం. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News