Madhavi Latha: సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేసిన నటి మాధవీలత

  • పోలీసులను ఆశ్రయించిన మాధవీలత
  • రెండు ఫిర్యాదులు దాఖలు
  • వాటిలో ఒకటి వ్యక్తిగతమైనదన్న మాధవీలత

టాలీవుడ్ నటి మాధవీలత సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలిశారు. సజ్జనార్ కార్యాలయానికి వెళ్లిన మాధవీలత ఫిర్యాదు చేశారు. దీనిపై ఆమె ఫేస్ బుక్ లో స్పందించారు. పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను కలిశానని, తనపై వస్తున్న వేధింపులకు సంబంధించి రెండు ఫిర్యాదులు చేశానని వెల్లడించారు. వాటిలో ఒకటి తన వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించినది కాగా, మరొకటి సోషల్ మీడియాలో తనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ దూషించడానికి సంబంధించినదని వివరించారు. మనసు గాయపడేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Madhavi Latha
Police
Sajjanar
Hyderabad
Cyberabad
  • Loading...

More Telugu News