Anil Kumar Yadav: ఏబీ వెంకటేశ్వరరావును మేమేమీ టార్గెట్ చేయడం లేదు: మంత్రి అనిల్

  • నిజాయతీపరులైన అధికారులు 85 శాతం ఉన్నారు
  • తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకున్నాం
  • అధికారులందరిపై చర్యలు తీసుకున్నట్టు భావిస్తే ఎలా?

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును తామేమీ టార్గెట్ చేయడం లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వానికి ఆయన ఏ విధంగా కొమ్ముకాశారన్నది టీడీపీ ఎంపీ కేశినేని నానినే స్వయంగా ట్వీట్ చేశారని సెటైర్లు విసిరారు.

ఒక అధికారిగా కాకుండా టీడీపీలో ఓ కీలక సభ్యుడిగా ఏబీ వెంకటేశ్వరరావు ఏ విధంగా వ్యవహరించారో రాష్ట్ర  ప్రజలందరికీ తెలుసని అన్నారు. వెంకటేశ్వరరావుపై తామేమీ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం లేదని, ఆయనపై ఉన్న ఆరోపణలు అబద్ధమని తేలితే ‘క్లీన్ చిట్’ లభిస్తుందని, నిజమైతే శిక్షించబడతారని అన్నారు. రాష్ట్రంలో నిజాయతీపరులైన అధికారులు 85 శాతం మంది ఉన్నారని, ఒకరో ఇద్దరో తప్పు చేసిన అధికారులపై యాక్షన్ తీసుకుంటే, అధికారులందరిపైనా చర్యలు తీసుకున్నట్టు భావించడం సబబు కాదని అన్నారు.

Anil Kumar Yadav
YSRCP
AB Venkateswara Rao
  • Loading...

More Telugu News