Rana: మూడు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న రానా కొత్త చిత్రం

  • రానా హీరోగా 'హాథీ మేరే సాథీ'
  • తెలుగులో 'అరణ్య', తమిళంలో 'కాదన్' గా వస్తున్న చిత్రం
  • ఏప్రిల్ 2న రిలీజ్

ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి నటిస్తున్న కొత్త చిత్రం 'హాథీ మేరే సాథీ'. తెలుగులో 'అరణ్య' పేరుతో, తమిళంలో 'కాదన్' గా వస్తోంది. ఈ వేసవిలో మూడు భాషల్లో ఒకేసారి రిలీజవుతోంది. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తున్నారు. ఎరోస్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకుడు. ఇందులో జోయా హుస్సేన్, శ్రియా ల్గావ్ కర్, పులకిత్ సామ్రాట్ ఇతర పాత్రధారులు. తాజాగా 'హాథీ మేరే సాథీ' పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రానా గెటప్ విలక్షణంగా కనిపిస్తోంది.

Rana
Haathi Mere Saathi
Hindi
Telugu
Tamil Nadu
  • Loading...

More Telugu News