VH: పిల్లలు చదువుకునే అవకాశం లేని రాష్ట్రం తెలంగాణే: వీహెచ్

  • టీఆర్ఎస్ సర్కారుపై వీహెచ్ ధ్వజం
  • స్కూళ్ల పక్కనే వైన్ షాపులున్నాయని ఆగ్రహం
  • విద్యార్థుల ఉసురు పోసుకోవద్దంటూ హితవు

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. కొత్త సచివాలయం అంశంపై స్పందిస్తూ, ప్రగతిభవన్ లో కూర్చోవచ్చు కదా, కొత్త సెక్రటేరియట్ ఎందుకని ప్రశ్నించారు. పిల్లలు చదువుకునే అవకాశం లేని రాష్ట్రం తెలంగాణే అని విమర్శించారు.

స్కూళ్ల పక్కనే వైన్ షాపులు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. వైన్ షాపుల నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సగం ఇచ్చినా ఫీజు రీయింబర్స్ మెంట్ చేయొచ్చని అన్నారు. గతంలో ఇంటికో ఉద్యోగం అన్నారు... ఆ విషయం ఏమైంది? అంటూ ప్రశ్నించారు. విద్యార్థుల ఉసురు పోసుకోవద్దని కేసీఆర్ ను అడుగుతానంటూ వీహెచ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News