Sailjanath: మూడు రాజధానులు కాదు, ఏపీ అభివృద్ధికి ప్రత్యేకహోదా ఒక్కటే మార్గం: శైలజానాథ్

  • గుంటూరులో శైలజానాథ్ మీడియా సమావేశం
  • జగన్ ప్రజావ్యతిరేకిగా మారారని విమర్శలు
  • కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం సీఎంకి లేదని ఎద్దేవా

ఇటీవలే పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన సాకే శైలజానాథ్ రాష్ట్ర పరిణామాలపై స్పందించారు. గుంటూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ, ఈ ఏడు నెలల పాలనలో జగన్ ఎంతో ప్రజావ్యతిరేకిగా మారారని ఆరోపించారు.

మాట తప్పనంటున్న జగన్ కు 22 మంది ఎంపీలుంటే ఎందుకు ప్రత్యేకహోదా కోసం లోక్ సభలో పోరాడడం లేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము ముఖ్యమంత్రికి లేదని ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని, సీఎం జగన్ ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల ఆలోచనతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు.

Sailjanath
Andhra Pradesh
Amaravati
Jagan
PCC
Congress
  • Loading...

More Telugu News